వెబ్ సిరీస్ లవైపు నటీనటుల చూపు.. లేటెస్ట్ హన్సిక


వెబ్ సిరీస్ లవైపు నటీనటుల చూపు.. లేటెస్ట్ హన్సిక
వెబ్ సిరీస్ లవైపు నటీనటుల చూపు.. లేటెస్ట్ హన్సిక

రెండేళ్ల క్రితం కూడా వెబ్ సిరీస్ లను పిచ్చ లైట్ తీసుకున్నారు నటీనటులు. సినిమా కంటే వాటిని తక్కువ స్థాయి మాధ్యమంగా పరిగణించారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. నటీనటులందరూ వెబ్ సిరీస్ లపై కన్నేశారు. ఈ విషయంలో బాలీవుడ్ ఎంతో ముందున్నా టాలీవుడ్ సైతం ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులేస్తోంది.

సమంత ఇప్పటికే ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగపతి బాబు ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ లో నటించేసాడు. మరోదాంట్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో అమలా పాల్ కూడా నటిస్తోంది. సందీప్ కిషన్ అయితే హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు.

లేటెస్ట్ గా వెబ్ సిరీస్ వైపు అడుగులేసింది హన్సిక. కామ్ గా వెబ్ సిరీస్ లో నటించడం షురూ చేసేసింది. ముంబై వెళ్లి మరీ షూటింగ్ లో పాల్గొంటోంది. పిల్ల జమీందార్, భాగమతి చిత్రాల దర్శకుడు అశోక్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. కంటెంట్ పరంగా ఎక్కువ ఫ్రీడమ్ లభించడం, బోల్డ్ గా చెప్పేందుకు ఎక్కువ స్కోప్ ఉండడంతో ఈ మధ్య కంటెంట్ క్రియేటర్స్ అందరూ వెబ్ సిరీస్ లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి.