అల్లు అర్జున్ సినిమాలో హన్సిక విలన్ ?


అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . నిన్ననే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది . అయితే ఈ సినిమాలో అందాల భామ హన్సిక విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు అల్లు అర్జున్ – హన్సిక జంటగా దేశముదురు చిత్రంలో నటించారు . కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది హన్సిక . అయితే ఈ సినిమాలో హన్సిక ది నెగెటివ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది .

అల్లు అర్జున్ సరసన మాత్రం పూజా హెగ్డే నటిస్తోంది . అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా డిజాస్టర్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాలో నటిస్తున్నాడు . త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి .