యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్


KTR
KTR

వారసత్వ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారసత్వం మాత్రమే అర్హతగా పదవులను పొందని వ్యక్తి శక్తి కల్వకుంట్ల తారకరామారావు . యంగ్ డైనమిక్ లీడర్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కేటీఆర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణలో కీలక భాగస్వామి అయ్యాడు . ఉద్యమ సమయంలో ఎన్నో ఆటు పోట్లని తట్టుకొని తండ్రికి అండగా నిలిచిన ధీరోదాత్తుడు కేటీఆర్ .

తెలంగాణ రాష్ట్రం సిద్దించాక ఐటీ , గ్రామీణాభివృది శాఖా మాత్యులుగా చెరగని ముద్ర వేశారు కేటీఆర్ . హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చి దిద్దే క్రమంలో అగ్ర పథాన నిలిచిన వ్యక్తి కేటీఆర్ . తండ్రికి తగ్గ తనయుడిగా భావితరాలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడిగా ఎదిగాడు . టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాక పార్టీని మరింత వేగవంతంగా నడిపిస్తున్న కేటీఆర్ పుట్టినరోజు ఈరోజు . ఈ సందర్బంగా యంగ్ డైనమిక్ లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది టాలీవుడ్ .