లేడీ సూపర్ స్టార్ నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు


లేడీ సూపర్ స్టార్ నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
లేడీ సూపర్ స్టార్ నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకైనా, సీనియర్ హీరోల సరసన సినిమాలకైనా బెస్ట్ ఆప్షన్ అంటే నయనతార పేరే వినిపిస్తోంది. గజినీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నయన్ అనతికాలంలోనే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వరసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదించింది. అయితే ఎప్పటికప్పుడు రిలేషన్ లో ఉండటం అమ్మడు కెరీర్ ను టాప్ లెవెల్ కు తీసుకెళ్లలేకపోయింది. మొదట శింబుతో ప్రేమాయణంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాయలనుకుంది. తర్వాత ప్రభుదేవాతో వ్యవహారం పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. అయితే ఆ తర్వాత నుండి నయన్ సినిమాల విషయంలో ఫుల్ సీరియస్ గా వ్యవహరించింది. సినిమాలను సీరియస్ గా తీసుకోవడంతో అవకాశాలు కూడా విరివిగా సంపాదించింది. ఈరోజు నయనతార పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్ నయనతార అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు గడిచినా ఇప్పటికీ నయన్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కాకుండా కమర్షియల్ హీరోయిన్ గా కూడా రాణిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో హీరోయిన్ గా నటించింది. అలాగే విజయ్ సరసన బిగిల్ లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన దర్బార్ లో కూడా నటించింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇలా హీరోయిన్ గా నయన్ కు అవకాశాలకేం కొదవలేదు. ఆమె పేరు మీదే ఆడిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయితే కోకొల్లలు. ఇప్పటికీ గ్లామర్ పరంగా నయన్ ఎవరికీ తీసిపోదు. ఇలా టాప్ రెమ్యునరేషన్ తో, టాప్ హీరోలతో నయన్ కెరీర్ దూసుకుపోతోంది.

ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఆమె లివింగ్ రిలేషన్ లో ఉంది. అతనితో కలిసి సినిమా ప్రొడక్షన్ లో కూడా భాగమైంది నయన్. ఇలా పర్సనల్ గానూ తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువలా వస్తున్నాయి. ఆమె ఇలాగే మరిన్ని సంవత్సరాలు మనల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.