రావి కార్తీక్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు!Ravi Kaarthik Choudary, Murali Mohan Ravi
Ravi Kaarthik Choudary, Murali Mohan Ravi

ఈరోజు మాకు అతి ముఖ్యమైన రోజు. మా www.tollywood.net ఎడిటర్ ఇన్ చీఫ్ మురళి మోహన్ రావి గారి కుమారుడు రావి కార్తీక్ చౌదరి, ఈరోజు అనగా ఆగష్టు 9న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజుతో 13వ ఏట అడుగుపెడుతున్న రావి కార్తీక్ చౌదరి, ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన టీనేజ్ లోకి అడుగుపెడుతున్నారు. ఓర్లాండో సైన్స్ స్కూల్ లో చదువుతున్న రావి కార్తీక్ చౌదరికి, జోర్నలిజం చేయాలని ఆకాంక్ష.

ఈ పుట్టినరోజు సందర్భంగా రావి కార్తీక్ చౌదరి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు భగవంతుని ఆశీర్వాదంతో సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాం. జీవితంలో అనుకున్నవి సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఎన్నో ఉన్నత విజయాలను అందుకోవాలని కోరుకుంటూ మరొక్క సారి మా రావి కార్తీక్ చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.