కొత్త సినిమా మొద‌లుపెట్టిన `హ్యాపీడేస్‌` రాహుల్!కొత్త సినిమా మొద‌లుపెట్టిన `హ్యాపీడేస్‌` రాహుల్!
కొత్త సినిమా మొద‌లుపెట్టిన `హ్యాపీడేస్‌` రాహుల్!

`హ్యాపీడేస్‌` చిత్రంలో టైస‌న్‌గా ఆక‌ట్టుకున్న రాహుల్ సోలో హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంత విరామం త‌రువాత రాహుల్ కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి విరాట్ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు. శ్రీ‌మ‌తి దివిజా స‌మ‌ర్ప‌ణ‌లో య‌స్‌.య‌స్ స్టూడియోస్ అండ్ విజ‌న్ మూవీస్ బ్యాన‌ర్‌పై యువ సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్‌,  నాగం తిరుప‌తిరెడ్డి, శ్రీ‌కాంత్ దీపాల సంయుక్తంగా నిర్మిస్తున్న థ్రిల్ల‌ర్ కామెడీ ఈ బుధ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

రాహుల‌్‌తో పాటు ఈ చిత్రంలో చేత‌న్‌, సాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య‌, య‌మీ హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌గా, చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన సాయి కార్తీక్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. మ‌రో నిర్మాత నాగం తిరుప‌తిరెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. శ్రీ‌కాంత్ దీపాల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ `ఇంత కాలం మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌లు చిత్రాల‌కు సంగీతం అందించిన నేను తొలిసారి ఈ మూవీతో ప్రొడ‌క్ష‌న్ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నాను. ఇదొక డిఫ‌రెంట్ ప్రాజెక్ట్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా న‌న్ను ఆద‌రించిన‌ట్టే నిర్మాత‌గా కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను` అన్నారు.

ఇదొక డిఫ‌రెంట్ కామెడీ థ్రిల్ల‌ర్. స‌బ్జెక్ట్‌కి త‌గ్గ న‌టీన‌టులు కుదిరారు. జ‌న‌వ‌రి వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తాం`అని ద‌ర్శ‌కుడు విరాట్ చ‌క్ర‌వ‌ర్తి చెప్పారు. ఈ మూవీని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్నామ‌ని, త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని శ్రీ‌కాంత్ దీపాల తెలిపారు. ఈ క‌థ విన్న‌ప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల‌య్యాను. సినిమా చూసిన ప్రేక్ష‌కులు కూడా అదే థ్రిల్‌ని ఫీల‌వుతార‌న్న న‌మ్మ‌క‌ముంది` అని హీరో రాహుల్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.