ఆ టైటిల్ మహేష్ బాబు కోసమేనా ?

Is HaraHara Shambho Shankara title for Mahesh babu ?మహేష్ బాబుసుకుమార్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు” 1” నేనొక్కడినే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . 2014 లో వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది అయితే నటుడిగా మహేష్ బాబు కు మంచి పేరు వచ్చింది . కట్ చేస్తే నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు ఏప్రిల్ నుండి . అయితే ఆ సినిమా కోసం టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది . ఛాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్ ” హర హర శంభో శంకర ”.

సుకుమార్ కోడైరెక్టర్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో అది మహేష్ బాబు కోసమే అన్న చర్చ జరుగుతోంది . అయితే అది నిజంగా మహేష్ బాబు కోసమేనా ? లేక తన శిష్యుడి కోసమా ? అన్నది కొద్దిరోజులు ఆగితే కానీ తెలీదు . ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు . అది ఏప్రిల్ లో విడుదల కానుంది . దాని తర్వాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు మహేష్ బాబు .

English Title: Is HaraHara Shambho Shankara title for Mahesh babu ?