హారిక, అరియనాలు ముందే ఎలిమినేట్ అయ్యారా?


హారిక, అరియనాలు ముందే ఎలిమినేట్ అయ్యారా?
హారిక, అరియనాలు ముందే ఎలిమినేట్ అయ్యారా?

బిగ్ బాస్ 4 ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తుంది. ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లో ఉన్నారు. అభిజీత్, అఖిల్, అరియనా, సోహైల్, హారికలు ఫైనలిస్ట్స్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు భారీ హంగుల మధ్య ఫైనల్స్ ఎపిసోడ్ జరగనుంది.

మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరవనున్నారు. ఇక మిగతా సెలబ్రిటీల సంగతి సరే సరి. భారీ డ్యాన్స్ కార్యక్రమాలు, స్కిట్స్ ఉంటాయి. సాధారణంగా అయితే ఫైనల్స్ రోజునే ఐదుగురిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతారు. అయితే ఈ విషయంలో ఈసారి బిగ్ బాస్ స్క్రిప్ట్ ను కొద్దిగా మార్చారని తెలుస్తోంది.

ఉన్న ఐదుగురిలో ఇద్దరి ఎలిమినేటడ్ ఎపిసోడ్స్ ను ఇప్పటికే చిత్రీకరించినట్లు సమాచారం. హారిక నెం 5 గా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అరియనా నెం 4 గా ఎలిమినేట్ అయింది. ఈ ఎపిసోడ్స్ ను ఇప్పటికే షూట్ చేసేసారట. ప్రముఖ సెలబ్రిటీలు వచ్చి ఈ రెండు ఎలిమినేషన్స్ ను కానిచ్చారట. ఇక ఈరోజు అఖిల్, సోహైల్, అభిజీత్ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తుందట.