కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావుHarish Rao
Harish Rao

తెలంగాణ లో మాస్ లీడర్ అయిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నాడు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ అప్రయత్నంగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు . అయితే ఆ కన్నీళ్లు బయట పడకుండా తుడుచుకోవడం అందరి కంట పడటంతో ఒక్కసారిగా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి ఆ వేదిక మీద . ఈ సంఘటన కేసీఆర్ స్వగ్రామం చింతమడక లో జరిగింది .

గతకొంత కాలంగా హరీష్ రావు – కేసీఆర్ ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది అంటూ రకరకాల కథనాలు  వస్తున్నాయి అయితే ఆ కథనాల సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు హరీష్ రావు . తెలంగాణ మంత్రివర్గంలో హరీష్ కు స్థానం లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి . కానీ హరీష్ మాత్రం నేను టీఆర్ఎస్ ని వీడేది లేదు అంటూ చెబుతూనే ఉన్నాడు .