మహేష్ బాబు ని కూడా తిడుతున్నారు

mahesh babu
mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని అతడి అభిమానులే తిడుతున్నారు . తమ అభిమాన హీరో పై అభిమానులకు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. హరీష్ రావు కు అన్యాయం జరగడమే ! కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అలాగే మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై ప్రశంసలు కురిపిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేయడమే ఈ దుమారానికి కారణం .

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కష్టపడిన హరీష్ రావు పేరు చెప్పకుండా కేటీఆర్ పేరు ఎలా చెబుతావ్ అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తూన్నారు . ఇప్పటికే నాగార్జున , రవితేజ లను తిడుతున్న హరీష్ రావు ఫ్యాన్స్ కు ఇప్పుడు మహేష్ బాబు కూడా దొరికాడు దాంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అసలు నువ్ ఇలాంటి వాడివి అనుకోలేదు , హరీష్ రావు పేరు చెప్పకపోయినా ఫరవాలేదు కానీ కేటీఆర్ పేరు ఎలా చెప్పావ్ ? అంటూ తిడుతున్నారు . చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మ్యాటర్ చాలా పెద్దదయ్యే అవకాశం కనబడుతోంది .