హరీష్ రావు కు ఘోరమైన అవమానమే ఇది


Harish rao
Harish rao

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కి ఘోరమైన అవమానం జరుగుతోంది . పేరుకి హరీష్ రావు అనే పేరు కానీ ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి హరీష్ రావు పోయి కాళేశ్వర్ రావు అనే పేరు సార్ధకం అయ్యేలా కష్టపడ్డాడు తన్నీరు హరీష్ రావు . అహోరాత్రులు శ్రమించి దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తిచేసాడు హరీష్ రావు . అయితే ఈలోపు ఎన్నికలు రావడం , మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది

 కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ హరీష్ రావు ని మాత్రం మంత్రిని చేయలేదు దాంతో మెల్లిమెల్లిగా హరీష్ ప్రాధాన్యం అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో పడిపోయింది . కట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చేసింది . అయితే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అవుతోంది కానీ హరీష్ కు మాత్రం గౌరవం దక్కడం లేదు దాంతో మరోసారి హరీష్ రావు పై చర్చ సాగుతోందిహరీష్ రావు అభిమానులు మాత్రం కేసీఆర్ పైన తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు