కేసీఆర్.. హరీష్ రావును డమ్మీ చేసేసాడా?kcr Hairsh rao
kcr Hairsh rao

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేనల్లుడు హరీష్ రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే గతంలో సమర్ధంగా నిర్వర్తించిన నీటి పారుదల శాఖ కాకుండా ఆర్ధిక శాఖను హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్.

ఇది జరిగిన మరుసటి రోజు కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రి ఉండగా కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఏంటనే విమర్శలు చేసారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు.

ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావును డమ్మీ చేసారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది.

హరీష్ రావును ఆర్ధిక మంత్రి చేసి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో అర్ధమేముంది అని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ బడ్జెట్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు కృష్ణసాగర్ రావు. రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి సంబంధించిన ప్రణాళిక సరిగా లేదు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతోందని ఆయన కేసీఆర్ ను దుయ్యబట్టారు.