పవన్ తో హరీష్ సినిమా వెనుక మాస్టర్ ప్లాన్..


పవన్ తో హరీష్ సినిమా వెనుక మాస్టర్ ప్లాన్..
పవన్ తో హరీష్ సినిమా వెనుక మాస్టర్ ప్లాన్..

మనకున్న కొద్ది మంది కమర్షియల్ దర్శకులలో హరీష్ శంకర్ ఒకడు. హీరోలను వారి అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా ప్రాజెక్ట్ చేయడంలో నేర్పరి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను పూర్తిగా సంతృప్తి పరిచాడు. ఒక రీమేక్ ను తీసుకుని దానికి మార్పులు చేసి హిట్ కొట్టి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన హరీష్ శంకర్ టాప్ లెవెల్ కు చేరుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. టాప్ స్టార్స్ ను హ్యాండిల్ చేయడంలో కూడా హరీష్ గతంలో తడబడ్డాడు. ఒక్క పవన్ ను పక్కనపెడితే ఎన్టీఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్యా, అల్లు అర్జున్ తో చేసిన డీజే రెండూ కూడా నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు మరోసారి గద్దలకొండ గణేష్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాన్ని మళ్ళీ చేజిక్కించుకున్న సంగతి తెల్సిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తోన్న పింక్ రీమేక్, క్రిష్ తో ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ఈ ఏడాదే హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టనున్నాడు హరీష్. మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు విందు అందివ్వడం ఖాయమని చెబుతున్నాడు ఈ దర్శకుడు. పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలు మిళితమయ్యేలా కథను సిద్ధం చేస్తున్న హరీష్, ఈ సినిమాతో హిట్ కొట్టి బాస్ చిరంజీవితో సినిమాను చేజిక్కించుకోవాలని ఆశిస్తున్నాడు.

ఇదివరకు పలు సందర్భాల్లో చిరంజీవి, హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశాన్ని వెళ్లబుచ్చిన సంగతి తెల్సిందే. అయితే రీ ఎంట్రీ తర్వాత టాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న చిరంజీవిని ఇంప్రెస్ చేయాలంటే పవన్ కళ్యాణ్ తో మూవీను సక్సెస్ చేయడం బెస్ట్ మార్గమని భావిస్తున్నాడు. దీనివల్ల తన అభిమాన హీరోకు మరోసారి హిట్ అందించిన ఘనత, తన ఇన్స్పిరేషన్ ను డైరెక్ట్ చేసే అవకాశం రెండూ దొరుకుతాయి. అందుకే పవన్ ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు హరీష్.