ప‌వ‌న్ సినిమా త‌రువాతే బాలీవుడ్‌కు?


ప‌వ‌న్ సినిమా త‌రువాతే బాలీవుడ్‌కు?
ప‌వ‌న్ సినిమా త‌రువాతే బాలీవుడ్‌కు?

స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ తెర కెక్కించిన `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం` బాలీవుడ్‌కు వెళుతున్న విష‌యం తెలిసిందే. దిల్‌రాజు మ‌రో నిర్మాత‌తో క‌లిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నారంటూ గత కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా హ‌రీష్‌శంక‌ర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం వుంద‌ని కూడా ప్ర‌చారం మొద‌లైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం హరీష్‌శంక‌ర్ బాలీవుడ్ కు వెల్ల‌డం లేద‌ని తెలిసింది.

హ‌రీష్‌శంక‌ర్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 28వ చిత్రాన్ని తెర‌కెక్కించే స‌న్నాహాల్లో వున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్నాయి. దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌ని ఇప్ప‌టికే పూర్తి చేసిన హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌ర్‌స్టార్ కోసం ఎదురుచూస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో పాటు క్రిష్ పిరియాడిక్ ఫిల్మ్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ రెండు చిత్రాలు పూర్త‌యిన త‌రువాతే ప‌వ‌న్ హ‌రీష్ శంక‌ర్ చిత్రానికి డేట్స్ కేటాయిస్తారు. ఇది పూర్త‌యిన త‌రువాతే హ‌రీష్ శంక‌ర్ బాలీవుడ్ బాట ప‌ట్ట‌నున్నార‌ట‌. ఆ కార‌ణంగానే ప‌వ‌న్‌తో సినిమా పూర్త‌య్యేంత వ‌ర‌కు ఏ సినిమా అంగీక‌రించ‌డం లేద‌ని హ‌రీష్ శంక‌ర్ వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.