నాగ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించిన హరీష్ శంకర్

నాగ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించిన హరీష్ శంకర్
నాగ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించిన హరీష్ శంకర్

ఈరోజు ప్రముఖ దర్శకులు ఈవివి సత్యనారాయణ జయంతి సందర్భంగా నిన్న రాత్రి ట్విట్టర్ స్పేసెస్ లో ఇవివి గురించి చర్చ నడిచింది. దీనికి అల్లరి నరేష్ తో పాటు ఇండస్ట్రీలోని దర్శకులు, రచయితలు అటెండ్ అయ్యారు. ప్రముఖంగా హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, భాస్కరభట్ల, బివిఎస్ రవిలతో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఈవివితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ హలో బ్రదర్ చిత్రం తన ఆల్ టైమ్ ఫెవరెట్ మూవీ అని అన్నాడు. బేసిక్ గా తాను చిరంజీవి ఫ్యాన్ అని, కానీ హలో బ్రదర్ చూస్తున్నంత సేపూ ఈ చిత్రం నాగ్ కు కాకుండా చిరుకు పడి ఉంటే బాగుండేదని చాలా సార్లు అనుకున్నామని అన్నాడు.

ఇది నాగ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. ఇదే విషయంపై మరోసారి స్పందించాడు హరీష్ శంకర్. నాగార్జున హలో బ్రదర్ కు పూర్తి న్యాయం చేసాడని, అయితే తన మాటలకు కట్టుబడి ఉన్నానని, నిజమైన ఫ్యాన్ ఎప్పుడూ వేరే బ్లాక్ బస్టర్లు చూసి తమ హీరోకు ఇలాంటి సినిమా వచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటారని తెలిపాడు.