నా మాటలు అందరికి మంచిగా ఇచ్చాను ఇప్పుడు వరుణ్ కి కుడా ఇస్తా!


Harish Shankar
నా మాటలు అందరికి మంచిగా ఇచ్చాను ఇప్పుడు వరుణ్ కి కుడా ఇస్తా!

రేపు ప్రపంచ వ్యాప్తంగా అంటే 20 సెప్టెంబర్ 2019 రోజున “వాల్మీకి ” సినిమా రిలీజ్ అవుతుంది, అంచానాలు బాగా ఉన్నాయి అని మనం చాలా పోస్ట్స్ చూసాం, విన్నాం.

కానీ ఈ సినిమా విషయం లో ఒకటి గమనిస్తే, ముఖ్యంగా చెప్పాలి అంటే మాటలు, మాటలసంభాషణలు (పంచ్ డైలాగ్స్). ఉదాహరణకి “మిరపకాయ్- రవితేజ”, “గబ్బర్సింగ్- పవన్ కళ్యాణ్”, “రామయ్య వస్తావయ్యా- జూ.ఎన్.టి.ఆర్”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్- సాయి ధరమ్ తేజ్”, “డి.జె.- అల్లు అర్జున్ “. నేను చెప్పిన సినిమాలు చూస్కుంటే అందులో హిట్లు,ఫట్లు వదిలేసి ఒకసారి ఆ సినిమాల లోని మాటలు చూడండి మీకే అర్ధం అవుతుంది.

రవితేజ దగ్గర నుండి అల్లుఅర్జున్ వరకు ఇచ్చిన పంచ్ డైలాగ్స్. ఒక్కో సినిమాలో వాళ్ళకి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మంచి డైలాగ్స్ ఇచ్చిన “హరీష్ శంకర్” ఇప్పుడు “వరుణ్ తేజ్” గారికి ఇవ్వాల్సిన వంతు. సినిమా ఎలా ఉన్న తన డైలాగ్స్ పరంగా ఎక్కడా తగ్గడు అని హరీష్ గారి ఫాన్స్ అంటున్నారు. చూద్దాం తెర మీద రేపు వరుణ్ కి కూడా మంచి డైలాగ్స్ అందిస్తాడో, లేదో!