రౌడీ కి బాగానే సమాధానం చెప్పాడే….


Harish Shankar
రౌడీ కి బాగానే సమాధానం చెప్పాడే….

దర్శకుడు ‘హరీష్ శంకర్’ తీసిన “గద్దలకొండ గణేష్” సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దానికి హరీష్ శంకర్ కూడా బాగానే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. కానీ అంతకుముందు “డి.జె” సినిమా యావరేజ్ అన్నప్పుడు హరీష్ శంకర్ మీడియా వాళ్ళ మీద వేసిన సెటైర్ ఇప్పటికి మరచిపోలేము. కానీ గద్దలకొండ గణేష్ సక్సెస్ ని మాత్రం తాను నిజంగానే మాటలు హద్దుల్లో పెట్టుకొని మాట్లాడుతున్న, ఇకనుంచి ఇలానే మాట్లాడుతా అని కూడా అన్నారు ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో.

హరీష్ శంకర్ గారు అలా మారడానికి కారణం లేకపోలేదు. అది ఏంటంటే హరీష్ గారు మన రౌడీ.. అదేనండి “విజయ్ సాయి దేవరకొండ” గారికి మెస్సేజ్ చేశారంటా… అందులో ఏమి జరిగిందంటే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ తర్వాత ఒకసారి కలుద్దాం అని విజయ్‌కు మెసేజ్ పెట్టానని చెప్పాడు. ఐతే దానికి విజయ్ బదులిస్తూ తాను ఏడాదిన్నర రెండేళ్ల పాటు ఫుల్ బిజీ అని, సినిమా గురించి డిస్కస్ చేసే విషయం అయితే కలవలేనని, వేరే విషయం అయితే కలుద్దామని అన్నాడట.

ఐతే దానికి మన హరీష్ గారు ‘నీతో సినిమా గురించి కాకుండా ఇంకేం మాట్లాడతా. రెండేళ్ల తర్వాతే కలుద్దాం’ అని బదులిచ్చాడట హరీష్. ఈ జవాబులోనే హరీష్ హర్టయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏదైనా మనకి మార్పు రావాలంటే కారణం ఉండాలి కాబట్టి హరీష్ గారు మాటల విషయంలో రౌడీ ప్రమేయం ఉండొచ్చు అని అంటున్నారు.

నిజానికి మనం అటు రౌడీ ని ఏమి అనలేము, ఇటు హరీష్ గారిని ఏమి అనలేము తప్పు ఒప్పుల గురించి మాట్లాడాడంకంటే మార్పు గురించి చూసుకుంటే బాగుంటుంది అని ఇరు వర్గాల ఫాన్స్ అనుకుంటున్నారు.