ఆగ‌లేక‌పోతున్న హ‌రీష్ శంక‌ర్‌!

ఆగ‌లేక‌పోతున్న హ‌రీష్ శంక‌ర్‌!
ఆగ‌లేక‌పోతున్న హ‌రీష్ శంక‌ర్‌!

త‌మ‌న్ అప్‌డేట్ కోసం క్రేజీ డైరెక్ట‌ర్ హారీష్ శంక‌ర్ ఆగ‌లేక‌పోతున్నార‌ట‌. త‌మ‌న్ సంగీతం అందించిన టీజ‌ర్ గురించి హాట్ న్యూస్ విన్న హ‌రీష్ శంక‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తాజా వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రెండున్న‌రేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ఆయ‌న రీఎంట్రీ కోసం ఎంచుకున్న చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ  చిత్రాన్ని బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు.

దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ మేజ‌ర్ పార్ట్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డానికి ముందే పూర్త‌యింది. మ‌రి కొంత భాగం చిత్రీక‌రించాల్సి వుంది. అయితే వ్యాక్సిన్ త‌రువాతే తాను షూటింగ్ చేస్తానంటూ ప‌వ‌న్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డంతో షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా నిలిపివేశారు. ఈ నెల 2న స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు కావ‌డంతో మ‌ళ్లీ హంగామా మొద‌లైంది. ఈ రోజున `వ‌కీల్ సాబ్‌` చిత్రం నుంచి టీజ‌ర్ రూపంలో ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ని చిత్ర బృందం అందించ‌డానికి రంగం సిద్ధం చేసింది.

అయితే ఈ టీజ‌ర్ కోసం అదిరిపోయే ట్యూన్స్‌ని, బ్యాగ్రౌండ్ స్కోర్‌ని త‌మ‌న్ అందించార‌ట‌. ఈ విష‌యం తెలిసిన ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ `కుమ్మేశావ‌ని న్యూస్ వ‌చ్చింది బావా.. ఆగ‌లేక‌పోతున్నా` అని ట్వీట్ చేయ‌డం టీజ‌ర్‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ అప్‌డేట్‌ని ఇవ్వ‌డానికి పిన్ చేయ‌డానికి నేనూ కూడా ఆగ‌లేక‌పోతున్నాన‌ని త‌మ‌న్ బ‌దులివ్వ‌డం ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల్లో మ‌రింత జోష్‌ని నింపేస్తోంది. ఈ మూవీ టీజ‌ర్‌ని బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నారు.