మొత్తానికి ఫైన‌ల్ స్క్రిప్ట్ లాక్ చేశారు‌!


మొత్తానికి ఫైన‌ల్ స్క్రిప్ట్ లాక్ చేశారు‌!
మొత్తానికి ఫైన‌ల్ స్క్రిప్ట్ లాక్ చేశారు‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ స్పీడు పెంచారు. ఇదివ‌ర‌కు ఏడాదికి ఒకే ఒక సినిమాతో ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్‌చేసిన ప‌వ‌ర్‌స్టార్ ప్ర‌స్తుతం ట్రెండు మార్చారు. వరుస‌గా సినిమాలు అంగీక‌రిస్తున్నారు. హ‌రీష్‌శంక‌ర్‌తో ఓ సినిమాని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అన‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు.

దీంతో ఈ సారి వీరిద్ద‌రూ క‌లిసి ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కాకుండా ఓ స‌మాజిక సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందించ‌బోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అయితే హ‌డావిడిగా ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించిన హ‌రీష్ శంక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌కు ఫైన‌ల్ స్క్రిప్ట్ వినిపించ‌లేద‌ట‌. దీని కోసం ఆరు నెల‌ల పాటు శ్ర‌మించిన హ‌రీష్ శంక‌ర్ మొత్తానికి ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని లాక్ చేసిన‌ట్టు తెలిసింది.

ఇటీవ‌లే ప‌వ‌న్‌తో జ‌రిగిన కీల‌క భేటీలో స్క్రిప్ట్‌ని వినిపించార‌ని, దీనికి ప‌వ‌న్ ఎలాంటి మార్పులు చెప్ప‌కుండానే ఫైన‌ల్ చేసిన‌ట్టు చెబుతున్నారు.  అయితే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలంటే హ‌రీష్ శంక‌ర్ మ‌రో ఏడాది పాటు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. వ‌కీల్‌సాబ్ ఫైన‌ల్ స్టేజ్ ఫినిష్ చేయాలి. క్రిష్ మూవీ ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే వుంది. ఈ రెండూ పూర్త‌యిన త‌రువాతే హ‌రీష్ శంక‌ర్ చిత్రం ప‌ట్టాలెక్కుతుంది.