వరుణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్.. ఈసారి మరింత పెద్దగా


Varun-Tej-and-Harish-Shankar
Varun-Tej-and-Harish-Shankar

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరున్న హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం తర్వాత మరో సినిమా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తాను రాసుకున్న దాగుడుమూతలు స్క్రిప్ట్ ను ఓకే చేయించుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అది వర్కౌట్ కాకపోవడంతో చివరికి వరుణ్ తేజ్ తో జిగర్తాండ చిత్రాన్ని రీమేక్ చేసాడు.

గద్దలకొండ గణేష్ గా విడుదలైన ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించకపోయినప్పటికీ చాలా దగ్గర్లో ఉంది. ఈరోజో రేపో దాన్ని అందుకోవడం ఖాయం. వరుణ్ తేజ్ తో తొలిసారి పనిచేసిన హరీష్ శంకర్, ఇంప్రెస్ అయిపోయాడట. అందుకే వరుణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా హరీష్ శంకర్ ప్రకటించాడు.

“అన్ని భాషల వారిని ఆకట్టుకోగల పర్సనాలిటీ వరుణ్ తేజ్ సొంతం. త్వరలోనే తనతో మరో సినిమా చేయబోతున్నా. అది తెలుగుతో పాటు పలు భాషలలో విడుదలవుతుంది” అని చెప్పాడు.