పవన్ సినిమా రూమర్స్ పై స్పందించిన హరీష్ శంకర్


Harish Shankar reacts on Pawan Kalyan fake news
Harish Shankar reacts on Pawan Kalyan fake news

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అమితంగా ఆనందించారు. అసలు పవన్ రీ ఎంట్రీకి ఈ సినిమా ఉంటే పెర్ఫెక్ట్ గా ఉంటుందని భావించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పంచుకున్నారు. ఇది పక్కా కమర్షియల్ కథతో తెరకెక్కనున్న సినిమాగా చెబుతున్నారు. అయితే ఈ సినిమా లాంచ్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న పింక్ సినిమా పూర్తయ్యాకే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది. అయితే ఇంకా సమయం ఉన్నా కానీ ఈ సినిమాపై రూమర్లు అయితే బానే వస్తున్నాయి.

తాజాగా ఒక వెబ్ సైట్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం కూడా రీమేక్ అని రాసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ కు రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి సేఫ్ రూట్ కోసం రీమేక్ ను ఎంచుకుంటున్నారని ఆ వెబ్ సైట్ రాసింది. వేదాళం రీమేక్ కానీ తేరి సినిమా రీమేక్ కానీ అవ్వొచ్చని ఆ వెబ్ సైట్ రాసేసింది.

ఇప్పటికే తేరి పోలీసోడుగా తెలుగులోకి డబ్ అయ్యి టీవీల్లో కూడా చాలా సార్లు ప్రసారమైందని రాసింది. అయితే ఈ విషయంపై హరీష్ శంకర్ స్పందించాడు. గాల్లో వార్తలు రాయొద్దని ఆ వెబ్ సైట్ కు చురకలు అంటించారు. దయచేసి అభిమానులను తప్పు ద్రోవ పట్టించకండి. ఏదైనా వార్త రాసేముందు కనుక్కుని రాయండి అని స్పందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రారంభమై వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలవుతుందని తెలుస్తోంది.