ప‌వ‌న్ – హ‌రీష్‌శంక‌ర్ మూవీకి హీరోయిన్ ఫిక్స్‌!


Harish shankar repeat his heroine pooja hegde third time
Harish shankar repeat his heroine pooja hegde third time

క్రేజీ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంకర్‌తో క‌లిసి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో భారీ చిత్రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌బోతున్నారు. ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, సుభాష్ చంద్ర‌బోస్, హ‌ర్లే డేవిడ్‌సన్ బైక్‌, దానిపై గాజుల స‌త్య‌నారాయ‌ణ పెద్ద బాల‌శిక్ష బుక్‌, ప‌క్క‌నే గులాబీ పువ్వు వుండ‌టం తో పాటు ఈ సారి ఎంట‌ర్‌టైన్‌మెంటే కాదు అంత‌కు మించి వుంటుంద‌ని హింట్ ఇచ్చారు హ‌రీష్ శంక‌ర్‌.

`గ‌బ్బ‌ర్‌సింగ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా అన్న న్యూస్ బ‌య‌టికి రావ‌డం, కాన్సెప్ట్ పోస్ట‌ర్ కొత్త‌గా వుండ‌టంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డంతో ఇది ఆయ‌న రాజ‌కీయ జీవితానికి కీల‌కంగా మార‌బోతోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. పంచ్‌లు , ప్రాస‌లతో థియేట‌ర్ల‌న్నీ ఈ ద‌ఫా ద‌ద్ద‌రిళ్ల‌డం ఖాయం అని చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా పూజా హెగ్డేను ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని త్వ‌ర‌లోనే హ‌రీష్‌శంక‌ర్ వెల్ల‌డించ‌నున్నార‌ట‌. గ‌తంలో హ‌రీష్‌శంక‌ర్ తెర‌కెక్కించిన `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` చిత్రాల్లో పూజా హెగ్డే కీల‌కంగా నిలిచింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు.