చిరుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్


చిరుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
చిరుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ కు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరుంది. తన కెరీర్ లో ప్లాపులున్నా కానీ స్టార్ హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా, అభిమానులు మెచ్చే విధంగా సినిమాలు తీస్తాడని అంటుంటారు. దానికి తగ్గట్లుగానే ఎంటర్టైనింగ్ సినిమాలతో ఎప్పటికప్పుడు మెప్పిస్తున్నాడు హరీష్ శంకర్. గతేడాది గద్దలకొండ గణేష్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్, ఈసారి పవన్ కళ్యాణ్ తో సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెల్సిందే. అయితే హరీష్ శంకర్ తో సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. రీసెంట్ గా హరీష్ శంకర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విశేషాలను పంచుకున్నాడు. పవన్ తో గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఒక అభిమానిలా మారి తీశానని, ఇప్పుడు కూడా ఒక నిజమైన అభిమానిలానే పవన్ తో సినిమా చేయబోతున్నానని తెలియజేసాడు హరీష్ శంకర్. అయితే సినిమా జోనర్ ఏంటి, కథ పాయింట్ ఏంటి అన్నదానికి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

కరోనా కారణంగా పవన్ తో సినిమా అనుకున్నదానికంటే ఆలస్యమవుతోందని, అయితే మన చేతుల్లో లేని దాని గురించి కంగారుపడటం కూడా అనవసరమని తెలియజేసాడు హరీష్. ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేదు. త్వరలో అన్నీ కుదిరితే చిరుతో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు హరీష్. ఒకవేళ మెగాస్టార్ తో సినిమా చేస్తే కనుక రౌడీ అల్లుడు తరహాలో మాంచి ఎంటర్టైనింగ్ కథను చేస్తానని, ఆయన కెరీర్ లో రౌడీ అల్లుడు తనకు చాలా స్పెషల్ చిత్రమని తెలియజేసాడు. అది ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి పరిస్థితుల బట్టి చూస్తుంటే పవన్ సినిమా 2021 చివరికి వచ్చే అవకాశముంది. అంటే వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించినా 2022 చివరికి కానీ ఆ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు