వాల్మీకి టైటిల్ వెనకాల రహస్యాన్ని చెప్పేసిన హరీష్ శంకర్


 Harish Shankar who tells Valmiki the secret behind the title
Harish Shankar

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ పై బోయ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు మెట్లెక్కిన సంగతి తెల్సిందే. ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అయితే వాల్మీకి చిత్ర యూనిట్ మాత్రం ఇందులో ఎవరి మనోభావాలూ దెబ్బ తీసే విధంగా సన్నివేశాలు ఉండవని, బోయ సంఘం వారు, వాల్మీకి అంటే ఇష్టపడేవారు ఖచ్చితంగా గర్వించేలా ఈ చిత్రం ఉంటుందని హరీష్ శంకర్ చెప్పుకొస్తున్నాడు.

ఈ వివాదం సంగతి పక్కనపెట్టి అసలు ఈ సినిమాకి వాల్మీకి టైటిల్ ఎందుకు సరైనదని భావించారు అని మీడియా ప్రశ్నించగా హరీష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒక మనిషికి సంబంధించి అత్యున్నత మార్పుకు ఉదాహరణగా వాల్మీకి గురించి చెప్పుకోవచ్చు. మా చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర కూడా గొప్పగా ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుంది. అందుకే వాల్మీకికి మించి బెస్ట్ టైటిల్ ఈ సినిమాకి లేదని భావిస్తున్నాం అన్నాడు.