రహస్య వివాహం చేసుకున్న టాలీవుడ్ నటుడు


Harish uthaman ties the knot with Amritha kalyanpur

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన నటుడు హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం చేసుకున్నాడు . గతకొంత కాలంగా అమృతా కళ్యాణ్ పూర్ ని ప్రేమిస్తున్నాడు హరీష్ ఉత్తమన్ . దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమ వ్యవహారం సాగుతోంది , అయితే ఎట్టకేలకు ఆ ప్రేమని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించిన హరీష్ – అమృత లు ఈనెల 6 న కేరళలోని గురువాయూర్ టెంపుల్ లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు . ఈ పెళ్లి విషయం గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు హరీష్ – అమృత లు .

టాలీవుడ్ లో జై లవకుశ , పవర్ , పండగ చేస్కో , శ్రీమంతుడు , జిల్ , కృష్ణగాడి వీర ప్రేమ గాధ , గౌరవం , ఎక్స్ ప్రెస్ రాజా , దువ్వాడ జగన్నాథం , నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా తదితర చిత్రాల్లో విలన్ గా నటించాడు హరీష్ ఉత్తమన్ . టాలీవుడ్ లోనే కాకుండా పలు తమిళ చిత్రాల్లో , మలయాళ చిత్రాల్లో నటించాడు హరీష్ ఉత్తమన్ . పెళ్లితో ఒక్కటైన ఈ జంట ని అందరూ ఆశీర్వదిస్తున్నారు అసలు విషయం తెలిసి . అలాగే షాక్ అవుతున్నారు కూడా .

English Title: Harish uthaman ties the knot with Amritha kalyanpur