`సెహ‌రి` టీజ‌ర్‌: వ‌ర్జిన్ స్టార్ పెళ్లి గోల‌!

`సెహ‌రి` టీజ‌ర్‌: వ‌ర్జిన్ స్టార్ పెళ్లి గోల‌!
`సెహ‌రి` టీజ‌ర్‌: వ‌ర్జిన్ స్టార్ పెళ్లి గోల‌!

హర్ష్ కనుమిల్లి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `సెహ‌రీ`. జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌కుడు. సిమ్రా‌న్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వ‌ర్గొపిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అద్వ‌య జిష్ణురెడ్డి, శిల్ప చౌద‌రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ టీజ‌ర్‌ని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

రోమ్-కామ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా హీరోగా హ‌ర్ష్ కానుమిల్లి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న నేప‌థ్యంలో ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసిన బాల‌కృష్ణ వ‌ర్జిన్ స్టార్ అనే బిరుదుని హ‌ర్ష్‌కి ఇచ్చారు. ఆ వీడియోని టీజ‌ర్‌లో వాడారు మేక‌ర్స్‌. జీవితంలో నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించే ఓ యువ‌కుడి క‌థ గా ఈ మూవీని ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు.

చివ‌రికి ఓ అమ్మాయి ప్రేమ‌లో ప‌డిన యువ‌కుడిగా క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? ఈ క్ర‌మంలె ఎలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌న‌రేట్ అయ్యింద‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌గా తెలుస్తోంది. ప్రశాంత్ ఆర్ విహారీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. `సెహారీ` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌లో విడుదల చేయాల‌ని మేకర్స్ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.