యంగ్ హీరోని బాల‌య్య అందుకే కొట్టారా?


యంగ్ హీరోని బాల‌య్య అందుకే కొట్టారా?
యంగ్ హీరోని బాల‌య్య అందుకే కొట్టారా?

నంద‌మూరి బాల‌కృష్ణ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో `సారే జ‌హాసే అచ్చా హే బుల్ హే బుల్ .. ` అంటూ వార్త‌ల్లో నిలిచారు. ఆ త‌రువాత ఓ మూవీ షూటింగ్‌లో త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంద‌ని కొట్టి హ‌ల్‌చ‌ల్ చేశారు. పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనూ అడ్డుగా వున్నార‌న్న కోపంతో ఫ్యాన్స్‌ని కూడా లెక్క‌చేయ‌కుండా కొట్ట‌డంతో వార్త‌ల్లో నిలిచారు హీరో బాల‌కృష్ణ‌.

తాజాగా ఓ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలోనూ అదే త‌ర‌హాలో హీరోని కొట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. హ‌ర్ష కానుమిల్లి న‌టిస్తున్న చిత్రం `సెహ‌రి`. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని కార్తిక సోమ‌వారం హీరో బాల‌కృష్ణ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాల‌య్య స్వ‌యంగా హీరోనే కొట్ట‌డం.. ఆ వీడియో కెమెరాకు చిక్కి వైర‌ల్ గా మారింది.

అయితే దీనిపై హీరో హ‌ర్ష కానుమిల్లి వివ‌ర‌ణ ఇచ్చాడు. త‌ను ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని ఎడ‌మ‌చేత ప‌ట్టుకున్నాన‌ని, అది బాల‌కృష్ఱ‌కు న‌చ్చ‌లేద‌ని దాంతో త‌న చేతిని కొట్టార‌ని, ఆ త‌రువాత తాను కుడిచేత్తో ప‌ట్టుకున్నాన‌ని అన్నారు. సెంటిమెంట్ ప్ర‌కారం రైట్ హ్యాండ్ తో ప‌ట్టుకోలేద‌న్న కార‌ణంగానే త‌న లెఫ్ట్ హ్యాండ్‌ని తీసేశార‌ని చెప్పుకొచ్చాడు.