విజయ్ దేవరకొండ 48 కోట్ల డీల్ లో నిజమెంత?

విజయ్ దేవరకొండ 48 కోట్ల డీల్ లో నిజమెంత?
విజయ్ దేవరకొండ 48 కోట్ల డీల్ లో నిజమెంత?

చాలా తక్కువ కాలంలోనే హీరోగా ఒక రేంజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. చాలా మంది హీరోలు ఏళ్లకేళ్లు ఇక్కడ ప్రయత్నించినా రాని క్రేజ్, స్థాయి విజయ్ కు కేవలం నాలుగేళ్లలోనే వచ్చాయంటే అది కేవలం అతని ప్రతిభ ఆధారంగానే జరిగిందని చెప్పవచ్చు. విజయ్ నటించిన లాస్ట్ రెండు సినిమాలు కూడా ప్లాపయ్యాయి, అయినా కానీ ఎక్కడ అతని క్రేజ్ కానీ మార్కెట్ కానీ కోల్పోలేదు. ఇంకా చెప్పాలంటే మరింత పెరిగింది. కేవలం టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో సైతం విజయ్ కూడా భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చేస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ చిత్ర షూటింగ్ పూర్తవ్వగానే జనవరి నుండి ఫైటర్ ను మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమా విషయంలో చాలానే విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

అక్కడ కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫైటర్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లేది ఈ బడా ఫిల్మ్ మేకర్. ఇక ఇక్కడితో కథ అయిపోలేదు. బాలీవుడ్ నుండి విజయ్ కు మరో భారీ ఆఫర్ వచ్చింది. అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ మన రౌడీ హీరోతో భారీ డీల్ ఒకటి సెట్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏకంగా 48 కోట్లు ఆఫర్ చేసి రెండు సినిమాల డీల్ ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ రెండు సినిమాలు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో తెరకెక్కించనున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుందని కూడా న్యూస్ వచ్చింది. అయితే ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని ప్రస్తుతం ఫైటర్ సినిమా బాలీవుడ్ కు వెళ్లడం వరకూ మాత్రమే కరెక్ట్ అనీ అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తీరిక లేకుండా ఉన్నాడు. ఫైటర్ సినిమా పూర్తి చేయాలి. దాని తర్వాత ఎప్పుడో మొదలుపెట్టి ఆపేసిన హీరో ప్రాజెక్ట్ ఉండనే ఉంది. అంతే కాకుండా దిల్ రాజు నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయాలి దేవరకొండ. ఇన్ని కమిట్మెంట్లు ఉండగా దేవరకొండ మరో కొత్త సినిమాను అంగీకరిస్తాడని అనుకోలేం అన్నది మరో న్యూస్. మరి ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.