మరో అరుదైన ఫీట్ కు దగ్గర్లో పవన్, మహేష్ అభిమానులు


మరో అరుదైన ఫీట్ కు దగ్గర్లో పవన్, మహేష్ అభిమానులు
మరో అరుదైన ఫీట్ కు దగ్గర్లో పవన్, మహేష్ అభిమానులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ ఇద్దరే. ఎన్ని ప్లాపులు వచ్చినా కానీ ఒక్క హిట్ ఇస్తే చాలు రికార్డులన్నీ గల్లంతవ్వడం ఖాయం. ఆ రేంజ్ హీరోలు బహుశా టాలీవుడ్ లో వీరిద్దరేనేమో. అటు పవన్ కళ్యాణ్ ఇటు మహేష్ బాబు ఇద్దరూ పెద్దగా ఒకరికొకరు కలుసుకోరు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోరు. అయినా కానీ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అటు పవన్ అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయం. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు మహేష్ బాబు విషెస్ చెప్పడం హైలైట్ గా అనిపించింది. ఆ సందర్భంగా వాళ్లిద్దరూ కలిసున్న పాత ఫోటో కూడా షేర్ చేసాడు మహేష్ బాబు. దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడం, మళ్ళీ ఆ రిప్లైను మహేష్ లైక్ చేయడం అందరినీ ఖుషీ చేసింది.

మరోవైపు మహేష్, పవన్ అభిమానులకు ఏది చేసినా పోటీపోటీ ఉంటుందన్న విషయం తెల్సిందే. ఇప్పుడు సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ తో మహేష్ అభిమానులు 80 మిలియన్ ట్వీట్స్ వేయగా, వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ తో పవన్ అభిమానులు 75 మిలియన్ ట్వీట్స్ వేశారు. మరి ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.