చరణ్ నటనకు ముగ్దుడైన ఎన్టీఆర్


Hats off to you Charan says jr ntrరంగస్థలం చిత్రంలో చిట్టిబాబు పాత్రకు ప్రాణం పోసిన రాంచరణ్ నటన కు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయి కాగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చరణ్ నటనకు ముగ్దుడయ్యాడట . ఇదే విషయాన్ని గురించి ట్వీట్ చేసాడు . చరణ్ ని అయితే పొగడ్తలతో ముంచెత్తాడు ఎన్టీఆర్ . చరణ్ కూడా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కి థాంక్స్ చెప్పాడు . చరణ్ తో పాటు గా సుకుమార్ ని అలాగే మైత్రి మూవీస్ సంస్థ పై ప్రశంసలు కురిపించాడు ఎన్టీఆర్ .

త్వరలో ఎన్టీఆర్ – చరణ్ లు రాజమౌళి దర్శకత్వంలో కలిసి నటించనున్న విషయం తెలిసిందే . బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కావడంతో పాటుగా ఎన్టీఆర్ , చరణ్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి . ఇక రంగస్థలం చిత్ర విషయానికి వస్తే భారీ వసూళ్ల ని సాధిస్తూ వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది .