కాజల్ అగర్వాల్ బర్త్ డే ట్రేండింగ్ గా మారింది!కాజల్ అగర్వాల్ బర్త్ డే ట్రేండింగ్ గా మారింది!
కాజల్ అగర్వాల్ బర్త్ డే ట్రేండింగ్ గా మారింది!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ బర్త్ డే ట్రేండింగ్ అవుతోంది.    ఈ రోజు కాజల్ పుట్టినరోజు. ఇది ఆమె 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కాజల్ కు విషెస్ ల వెల్లువ ట్రేండింగ్ గా మారింది #Happybirthdaykajal, #HBDkajalAgarwal అని హ్యాష్సో ట్యాగ్షి లు సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతోంది.

తేజ రూపొందించిన ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తరువాత కృష్ణవంశీ ‘చందమామ’తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోని టాప్ హీరోలతో కలిసి నటించిన కాజల్ పడింది అన్న ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ పుంజుకుంటోంది.
తాజాగా ఆమె నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీచిన రూపొందిస్తున్నారు. ఇందులో కాజల్ మంచు విష్ణుకు సోదరిగా నటిస్తోందని అంటున్నారు. కాజల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. అర్ధనారీశ్వరుడిలా సగం విష్ణు, సగం కాజల్ పేస్ కనిపిస్తోన్న లుక్ ఆకట్టుకుంటోంది.