ఎన‌ర్జిటిక్ స్టార్ కోసం హాట్ ఐట‌మ్ నంబ‌ర్‌!


Hebbah Patel turned item girl for ram
Hebbah Patel turned item girl for ram

`ఇస్మార్ట్ శంక‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ఎన‌ర్జిటిక్ హీరో రామ్ క్రేజ్ మారిపోయింది. మార్కెట్ స్థాయి కూడా పెరిగిపోయింది. దీంతో తాజా హిట్‌ని, పెరిగిన మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని తాజా చిత్రాన్ని మ‌రింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం `రెడ్‌`. త‌మిళ హిట్ `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు.

రామ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేసింది. మాళ‌విక శ‌ర్మ‌, నివేదితా పేతురాజ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం మ‌రో హాట్ ఐట‌మ్ నంబ‌ర్‌ని చిత్ర బృందం యాడ్ చేసింది. ఇద్ద‌రు హీరోయిన్‌లు వుండ‌గా గ్లామ‌ర్ కోసం హెబ్బా ప‌టేల్‌ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. అయితే ఆమెది ఫుల్ లెంగ్త్ రోల్ కాద‌ని, ఓ హాట్ ఐట‌మ్ నంబ‌ర్ కోసం హెబ్బాను తీసుకున్నార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం ఈ పాట‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌ని జానీ మాస్ట‌ర్ నేతృత్వంలో షూట్ చేస్తున్నారు. సినిమాకి ఈ పాట స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నుంద‌ట‌. ఇటీవ‌ల నితిన్ హీరోగా విడుద‌లైన `భీష్మ‌` చిత్రంలో హెబ్బా ప‌టేల్ బోల్డ్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.