బిగ్ బాస్ ఫైనల్ లో ఇస్మార్ట్ భామ సందడి.. బిగ్ బాస్ కో దండం!


బిగ్ బాస్ ఫైనల్ లో ఇస్మార్ట్ భామ సందడి.. బిగ్ బాస్ కో దండం!
బిగ్ బాస్ ఫైనల్ లో ఇస్మార్ట్ భామ సందడి.. బిగ్ బాస్ కో దండం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఫైనల్స్ కు సంబంధించి ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు. ఫైనల్ విజేతను ప్రకటించడానికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని నాగార్జున స్వయంగా వెళ్లి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. మెగాస్టార్ కూడా ఈ ఆహ్వానానికి ఎస్ చెప్పాడు. సో, మెగాస్టార్ చేతుల మీదుగా ఫైనల్స్ కు వెళ్లిన ఐదుగురిలో ఒకరు టైటిల్ ను అందుకోబోతున్నారు. ఇప్పుడున్న ఐదుగురిలో ప్రతి ఒక్కరూ టైటిల్ కోసం కష్టపడుతున్నారు. ఎవరికీ క్లియర్ ఎడ్జ్ అనేది లేదు. ఉన్నవాళ్లలో శ్రీముఖి, రాహుల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి వీరిలో ఒకరు విజేత అవుతారా లేక బాబా భాస్కర్, అలీ, వరుణ్ లో ఒకరు విజేత అవుతారా అన్నది చూడాల్సి ఉంది. ఆదివారం రాత్రి నుండే వోటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అవి శనివారం రాత్రి 12 గంటల వరకూ ఓపెన్ లోనే ఉంటాయి. హాట్ స్టార్ యాప్ లో నచ్చిన కంటెస్టెంట్ కు రోజుకి 10 ఓట్లు వేసే వీలుంది. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా నచ్చిన కంటెస్టెంట్ కు ఓటు వేసుకోవచ్చు.

ఇది పక్కన పెడితే, చిరంజీవిని పిలవడమే కాకుండా బిగ్ బాస్ ఫైనల్స్ ఆకర్షణీయంగా ఉండడానికి వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. ఈ షో తో టీఆర్పీలు రికార్డు స్థాయిలో నమోదు కావాలని బిగ్ బాస్ యాజమాన్యం కోరుకుంటోంది. అందుకే స్పెషల్ అట్రాక్షన్ కోసం చాలా ప్రణాళికలు వేసింది. బిగ్ బాస్ ను గ్రాండ్ గా ముగించడానికి స్టార్ హీరోయిన్ ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ ను ఆహ్వానించారట. ఈ భామ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో 5 నుండి 10 నిమిషాల పాటు సాగే డ్యాన్స్ నంబర్స్ కు ఆడనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంతవరకూ లేదు.

మరోవైపు బిగ్ బాస్ వారు ఈ సీజన్ లో పాల్గొన్న అందరు కంటెస్టెంట్స్ కు ఆహ్వానాలు పంపారు. ఫైనల్స్ రోజున షో కు అతిథులుగా రావాలని కోరారు. ఈ ఆహ్వానాన్ని నటి హేమ తిరస్కరించిందని తెలుస్తోంది. మొదట్నుండి ఆమె బిగ్ బాస్ పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ షో లో కంటెస్టెంట్స్ అందరూ ముసుగులు వేసుకుని బతుకుతున్నారని ఆమె ఆరోపించింది. ముఖ్యంగా ఈ షో లో శ్రీముఖి బయటకు ఒకటి చేస్తుందని, లోపల మాత్రం వేరే ఉంటుందని ఆమె ఆరోపించింది. బిగ్ బాస్ నుండి నాకు ఆహ్వానం అందింది. అయితే నేను రానని చెప్పేసాను. బిగ్ బాస్ కో పెద్ద దండం అని ఆమె వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ లో ఎక్కువ ఆటగాళ్ల చెడును మాత్రమే చూపించే ప్రయత్నం చేసారు. ఈ షో లో ఎలిమినేషన్స్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే జరగదు. ముందే బిగ్ బాస్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఎవరి వల్ల టీఆర్పీ ఎక్కువ వస్తుందో వాళ్లనే షో లో ఉంచుతారు.