అజిత్ దంప‌తులకు ఏమైంది?


అజిత్ దంప‌తులకు ఏమైంది?
అజిత్ దంప‌తులకు ఏమైంది?

దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ రోజు రోజుకీ పెరుగుతోంది. ఎంత కంట్రోల్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కంట్రోల్ కావ‌డం లేదు. దీంతో ఎప్పుడు ఎవ‌రి గురించి ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందా అని అంతా భ‌యంతో వ‌ణికిపోతున్నారు. త‌మ వాళ్ల‌కు ఏమీ కాకూడ‌ద‌ని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే త‌మిళ‌నాడులో క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ దాదాపు 14 వేల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 94 మంది మృత్యువాత ప‌డ్డారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా జ‌నాల‌ల్లో మార్పు రాక‌పోవ‌డంతో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇదిలా వుంటే త‌మిళ స్టార్ హీరో అజిత్ దంప‌తులు ఈ రోజు చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్‌కు వెళ్ల‌డం ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌రానికి గురిచేసింది.

మాస్కులు ధ‌రించి భార్య షాలినితో క‌లిసి అజిత్ అపోలో ఆసుప‌త్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. త‌మ ఆరాధ్య న‌టుడికి ఏం జ‌రిగింద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం మొద‌లైంది. అయితే జ‌న‌ర‌ల్ చెక‌ప్ కోస‌మే అజిత్ దంప‌తులు ఆసుప‌త్రికి వ‌చ్చార‌ని, అంత‌కు మించి భ‌య‌ప‌డాల్సిన ప‌నేమీ లేద‌ని అజిత్ అభిమానులు కొంత మంది ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇస్తున్నారు.

Credit: Twitter