ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ నాదే.. హీరో ఆకాష్!1


Hero Akash Copy Allegations on Puri Jagannath Ismart Shankar Movie
Hero Akash Copy Allegations on Puri Jagannath Ismart Shankar Movie

ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ నాదే.. హీరో ఆకాష్!1

బాక్సాఫీసు వద్ద ఇప్పటికే 50 కోట్లు రాబడుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాన్సెప్ట్‌ తనదేనని హీరో, రచయిత ఆకాష్‌ పేర్కొన్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన సినిమా ఇది. ఓ వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందింది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విజయం అందుకుంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్లకుపైగా రాబట్టిందని నిర్మాతలు వెల్లడించారు. కాగా ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. ఈ కాన్సెప్ట్‌ తనదని ‘ఆనందం’ ఫేం ఆకాష్‌ మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆకాష్‌ మాట్లాడుతూ.. ‘ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో నన్నే హీరోగా పెట్టి దర్శకురాలు రాధా ఓ సినిమా తీశారు. ఆ చిత్రం తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైంది. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో షాక్ తగిలింది. ఈ విషయమై పూరీ జగన్నాథ్‌ను సంప్రదించాలని ప్రయత్నించాం. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో తమిళ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసి, సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించాం’ అని చెప్పారు. అంతేకాదు ఆయన తన వాదనను వినిపించి, ఆధారాలను కూడా మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.