గాయాలపాలైన డాక్టర్ రాజశేఖర్


Hero dr. rajasekhar injured in kalki shooting

యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ కల్కి షూటింగ్ లో గాయాలపాలయ్యాడు . అయితే స్వల్ప గాయాలు మాత్రమే తగలడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తాజాగా కల్కి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ప్రశాంత్ అనే కుర్ర డైరెక్టర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు రాజశేఖర్ . 1980 నాటి కాలం కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ఇన్ వెస్టిగేటివ్ పాత్రలో నటిస్తున్నాడు . కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ స్టూడియో లో జరుగుతోంది . యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్డటంతో రాజశేఖర్ డూప్ లేకుండా పాల్గొంటున్నాడు .

అయితే ఆ సమయంలో రాజశేఖర్ తల కు , భుజానికి గాయాలు కావడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ కి గురయ్యింది . గాయాల పాలైన రాజశేఖర్ ని వెంటనే ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేయగా అందుకు రాజశేఖర్ నిరాకరించి షూటింగ్ కంప్లీట్ చేసి ఆసుపత్రికి వెళ్ళాడట . ఇదంతా ఎందుకంటే చాలాకాలం పాటు సినిమాలు లేక చేసిన సినిమాలు హిట్ కాక ఇబ్బంది పడ్డాడు రాజశేఖర్ , అయితే ఆ సమయంలో గరుడ వేగ సూపర్ హిట్ కావడంతో ఈ రిస్కీ షాట్స్ చేయడానికి ముందుకు వచ్చాడు అభిమానులను అలరించడం కోసం . గతంలో మగాడు షూటింగ్ లో రాజశేఖర్ గాయపడి చాలాకాలం పాటు ఇంటికే పరిమితం అయ్యాడు కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది . దాంతో కల్కి కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు .

English Title: Hero dr. rajasekhar injured in kalki shooting