అభిమాన హీరోని చూడటానికి వచ్చి చనిపోయాడు


hero dulquer salmaan fan dies during mall inaguarationఅభిమాన హీరోని దగ్గరగా చూడాలని ప్రయత్నం చేసిన ఓ అభిమాని గుండె ఆగి చనిపోవడంతో దుల్కర్ సల్మాన్ అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కు స్టార్ హీరోగా క్రేజ్ వచ్చేసింది దాంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . హరి అనే వీరాభిమాని దుల్కర్ అంటే ప్రాణం దాంతో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వస్తుండటంతో భారీ ఎత్తున అభిమానులు అతడ్ని చూడటానికి వచ్చారు కాగా అదే గుంపులో హరి అనే అభిమాని కూడా వచ్చాడు .

 

అయితే క్రౌడ్ మరీ ఎక్కువగా ఉండటంతో దుల్కర్ ని చూడటానికి అభిమానులు పోటీపడ్డారు , దాంతో తొక్కిసలాట మొదలయ్యింది ఆ తొక్కిసలాటలో హరి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు . వెంటనే అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది . అప్పటికే హరి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు . దుల్కర్ అభిమాని కి అంతకుముందే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని ఇలాంటి చోట్లకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అజాగ్రత్త తో నిండు ప్రాణం బలైంది . అయితే క్రౌడ్ ఎక్కువ రావడం షో రూమ్ నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఆగ్రహించిన పోలీసులు షో రూం నిర్వాహకులపై కేసు నమోదు చేసారు .

English Title: hero dulquer salmaan fan dies during mall inaguaration