హీరో గోపీచంద్ కు గాయాలు


Hero Gopichand injured

హీరో గోపీచంద్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి .తాజాగా ఈ హీరో తిరు దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ బోర్డర్ లో జరుపుకోగా ప్రస్తుతం జైపూర్ లో జరుపుకుంటోంది. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా బైక్ ఛేజింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు తిరు.

 

అయితే బైక్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పడంతో గోపీచంద్ కిందపడ్డాడు . దాంతో గోపీచంద్ కు గాయాలయ్యాయి. హీరోకు గాయాలు కావడంతో షాక్ కి గురైన చిత్ర యూనిట్ వెంటనే గోపీచంద్ ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గోపీచంద్. మళ్లీ హీరో పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ జరుగనుంది.

English Title: Hero Gopichand injured