గోపీచంద్ కి రెమ్యునరేషన్ లేనట్లేనా?

Hero Gopichand without remuneration
Hero Gopichand without remuneration

కష్టపడి పైకొచ్చిన నటుల్లో గోపీచంద్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వందలకోట్ల మార్కెట్ లేకపోయినప్పటికీ గోపీచంద్ గురించి అందరికి తెలుసు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మనోడి బ్యాడ్ లక్ ఏమిటో గా స్టార్ హీరోల రేంజ్ లోకి రాలేకపోతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా హీరోగా మార్కెట్ ని పెంచుకోలేకపోతున్నాడు.

ఇటీవల కాలంలో అయితే గోపీచంద్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ తో ఊహించని అపజయాలను ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడినా పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రావడం లేదు. మొన్న దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాణక్య అయితే మరీ దారుణంగా నష్టాలను మిగిల్చింది. ఆ దెబ్బతో గోపి కొత్త సినిమా ఒకటి ఆగినట్లు టాక్ వచ్చింది. ఇక సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా మాత్రం సెట్స్ పైకి వచ్చింది.
ఆ సినిమా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని గోపీచంద్ చాలా కష్టపడుతున్నాడు. ఫిట్ నెస్ లో కూడా చాలా మార్పులు తేనున్నాడట. ఇకపోతే సినిమా బడ్జెట్ దృష్ట్యా గోపీచంద్ రెమ్యునరేషన్ ని ముందే తీసుకోవడం లేదని టాక్ వస్తోంది. గోపీచంద్ మార్కెట్ కంటే కూడా ఒక 30% బడ్జెట్ పెరుగుతుండడంతో హీరో పారితోషికంని పెండింగ్ లో పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సినిమాను మాత్రం స్టైలిష్ గా రూపొందిస్తున్నట్లు సమాచారం.