విడాకులు తీసుకున్న హీరో మళ్ళీ పెళ్లి


hero hrithik roshan sussanne khan remarry

చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని పదేళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కూడా కన్న తర్వాత భార్య విబేధించడంతో విడాకులు తీసుకున్నాడు హీరో హృతిక్ రోషన్ అయితే తాజాగా మళ్ళీ సుసానే ఖాన్ ని పెళ్లి చేసుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . హృతిక్ రోషన్ – సుసానే ఖాన్ లకు ఇద్దరు పిల్లలు కాగా హృతిక్ కంగనా రనౌత్ తో ప్రేమ వ్యవహారం వెలగబెడుతూ సుసానే ఖాన్ ని నిర్లక్ష్యం చేయడంతో అతడితో ఉండేది లేదని విడిగా ఉండి ఎట్టకేలకు విడాకులు తీసుకుంది సుసానే ఖాన్ .

కట్ చేస్తే కొద్దిరోజులకే కంగనా రనౌత్ తో హృతిక్ తో విబేధాలు వచ్చాయి పైగా పెద్ద గొడవలు కూడా అయ్యాయి కంగనా కు హృతిక్ కు . ఏకంగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కూడా . అయితే భార్యతో విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల కోసం విదేశాలు చుట్టి వస్తూ ఉండటంతో పిల్లల వల్ల మళ్ళీ ఇద్దరి మనసులు కలిశాయట దాంతో విడిపోయిన ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది .పెళ్లి వార్తలు అయితే వస్తున్నాయి కానీ హృతిక్ రోషన్ అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలీదు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా ? లేక దూరంగా ఉంటూనే మనసులు దగ్గర అవుతాయా ? అన్నది చూడాలి .

English Title: hero hrithik roshan sussanne khan remarry