మిడిల్ క్లాస్ యువకుడు తిరగబడితే ఎలా ఉంటాడో వాడే గుణ

Guna 369
Guna 369

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కార్తికేయ తాజాగా గుణ 369 చిత్రంతో మరోసారి సత్తా చాటడానికి వస్తున్నాడు . ఆగస్టు 2 న అంటే రేపు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది . దాంతో ఆ సినిమా విశేషాలను వెల్లడించాడు హీరో కార్తికేయ . నన్ను ఇప్పటికి కూడా ఆర్ ఎక్స్ 100 హీరో అనే అంటున్నారు , కార్తికేయ అని కూడా చాలామందికి తెలియదు కానీ దాన్ని తప్పకుండా ఈ గుణ 369 బ్రేక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు .

మధ్యలో హిప్పీ అనే డిజాస్టర్ చిత్రంతో కొంత ఇబ్బంది పడినప్పటికీ , హిట్ , ప్లాప్ కామన్ అని నేను చేస్తున్న సినిమాల్లో సినిమా సినిమాకు ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తున్నానన్నదే నాకు ముఖ్యమని అంటున్నాడు . ఇక గుణ 369 విషయానికి వస్తే ఓ మిడిల్ క్లాస్ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడాల్సి వస్తే ఎలా ఉంటాడో దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పే చిత్రమని , సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ కొడతామన్న ధీమా వ్యక్తం చేసాడు కార్తికేయ .