హీరో కార్తీ కి కోపం వచ్చేలా చేసింది


Hero Karthi unhappy with kasthuri

తమిళ స్టార్ హీరో కార్తీ మాజీ హీరోయిన్ కస్తూరి పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడట ! ఇటీవలే చెన్నై లో జరిగిన ఓ ఆడియో వేడుకలో పాల్గొన్నాడు కార్తీ , అయితే ఆ వేడుకకు యాంకర్ గా వ్యవహరించింది మాజీ హీరోయిన్ కస్తూరి . మాటల మధ్యలో కార్తీ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది కస్తూరి అయితే ఇక్కడ మీ నాన్నగారు లేరు కదా ! అంటూ సెటైర్ వేసిందట దాంతో కార్తీ కి ఎక్కడా లేని కోపం వచ్చిందట కానీ తమాయించుకొని సెల్ఫీ తీసుకోవడం వల్ల సెల్ ఫోన్ నుండి వచ్చే ఫ్లాష్ లైట్ల వల్ల మైగ్రేన్ వచ్చే సమస్య ఉందని అది తెలుసుకుంటే మంచిదని చెప్పి కస్తూరి కి సెల్ఫీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడట .

 

దాంతో ఖంగుతిన్న కస్తూరి తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిందట . 90 వ దశకంలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది కస్తూరి . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ అడపా దడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది అలాగే యాంకర్ గా కూడా చేస్తోంది . ఆమధ్య కార్తీ తండ్రి శివకుమార్ సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఓ అభిమాని సెల్ ఫోన్ ని విసిరి అవతల పడేసి వివాదానికి కారణమైన విషయం తెలిసిందే .

English Title : Hero Karthi unhappy with kasthuri