ఆ యోధుల‌ను గౌర‌విద్దాం: మ‌హేష్‌

ఆ యోధుల‌ను గౌర‌విద్దాం: మ‌హేష్‌
ఆ యోధుల‌ను గౌర‌విద్దాం: మ‌హేష్‌

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో ఇప్పుడిప్పుడే పాకుతోంది. దీనిపై అంతా జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. హీరో మ‌హేష్ బాబు ఈ సంద‌ర్భంగా స్పందించారు. భ‌య‌పెట్టే, ఆందోళ‌న క‌లిగించే వ్య‌క్తుల‌కు దూరంగా వుండండి అని ట్విట్ట‌ర్ వేదిక‌గా మంగ‌ళ‌వారం స్పందించారు. క‌రోనా వైర‌స్‌పై వ‌స్తున్న వ‌రుస వార్త‌ల‌ను ఉద్దేశించి మ‌హేష్ పై విధంగా స్పందించారు. భౌతిక దూరం, ప‌రిశుభ్ర‌త‌తో పాటు మ‌రొటి పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

`దీన్ని ప్ర‌తీ ఒక్క‌రూ చ‌ద‌వాల‌ని, ప్రేమ‌, ఆశ‌ల్ని, పాజిటివిటీని వ్యాప్తి చేయాల‌ని కోరుతున్నా. మ‌న‌మంతా క‌లిసి ఈ తుఫానుతో పాటు ప్ర‌యాణిస్తున్నాం. దూరం (సోసియ‌ల్ డిస్టెన్సీని) పాటించ‌డం, ప‌రిశుభ్రంగా వుండ‌టంతో పాటు మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని మ‌నం దృష్టిలో వుంచుకోవాలి. అదే భ‌యాన్ని దూరంగా వుంచ‌డం. ఆందోళ‌న‌, భ‌యాన్ని క‌లిగించే వ్య‌క్తుల‌కు, వార్త‌ల‌కు దూరంగా వుండండి.. ప్ర‌స్తుత త‌రుణంలో త‌ప్పుడు వార్త‌లు పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. త‌ప్పుదారి ప‌ట్టించే స‌మాచారానికి దూరంగా వుండండి` అన్నారు.

లాక్‌డౌన్ ప్ర‌క‌టించి రెండు వారాల‌వుతోంది. మ‌నం చాలా బ‌లంగా ముందుకు వెళుతున్నాం. ఐక‌మ‌త్యంగా ప‌నిచేస్తున్న మ‌న ప్ర‌భుత్వాల‌ను అభినందించాలి. నేడు ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం. ఈ సంద‌ర్భ‌గా మ‌న‌మంతా ఆరోగ్యంగా వుండేందుకు కోవిడ్ 19తో పోరాడుతూ ముందు వ‌రుస‌లో నిల్చున్న వారికి ధ‌న్య‌వాదాలు చెబుదాం. త‌మ ఆరోగ్యాన్ని ప్ర‌మాదంలోకి నెట్టి ప్రాణాల‌కు తెగించి మ‌న కోసం శ్ర‌మిస్తున్న యోధుల‌ను గౌర‌విద్దాం. మీ అంద‌రికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ వుండాలి` అని ట్వీట్ చేశారు హీరో మ‌హేష్‌.