మంచు విష్ణు నాలుగోసారి తండ్రి అవుతున్నాడు


మంచు విష్ణు నాలుగోసారి తండ్రి అవుతున్నాడు
మంచు విష్ణు నాలుగోసారి తండ్రి అవుతున్నాడు

హీరో మంచు విష్ణు నాలుగోసారి తండ్రి అవుతున్నాడు . ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన ఈ హీరో ఇప్పుడు మళ్ళీ తండ్రి కాబోతున్నాడు . మంచు విష్ణు తన భార్య విరానిక తో దిగిన ఫోటోని ట్వీట్ చేసి ఈ విషయాన్నీ వెల్లడించాడు . తన భార్యకు ఇష్టమైన ప్రదేశం అమెరికా లోని న్యు యార్క్ కు వెళ్లి అక్కడి నుండి ఈ విషయాన్నీ వెల్లడించాడు . మా కుటుంబం లోకి నాలుగో బిడ్డ రాబోతున్నట్లు , అదే నా జీవితాని మార్చేస్తున్న సంఘటన అంటూ ట్వీట్ చేసాడు మంచు విష్ణు .

ఇంతకుముందు మంచు విష్ణు- విరానిక లకు ముగ్గురు పిల్లలు . అందులో ఇద్దరు కవల పిల్లలు అరియానా – వివియానా , కొడుకు అవరం కాగా ఇప్పుడు నాలుగో సంతానం గా మళ్ళీ అమ్మాయి రాబోతోంది . మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం ఓటర్ కాగా ఆ చిత్రం వివాదంలో ఉంది . ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి .