తనతో తనే యుద్ధం చేస్తున్న“నాగశౌర్య”


తనతో తనే యుద్ధం చేస్తున్న“నాగశౌర్య”
తనతో తనే యుద్ధం చేస్తున్న“నాగశౌర్య”

సినిమా ఇండస్ట్రీని తెలుగులో చిత్ర పరిశ్రమ అని అంటారు. పేరుకి తగ్గట్టే ఇక్కడ మనుషుల కష్టాలు కూడా చిత్ర, విచిత్రంగా ఉంటాయి.ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నా, స్నేహం ఉన్నా, ఇంకా ఎలాంటి బంధాలు ఉన్నా, అవన్నీ సినిమా తరువాతే. ఒక్కోసారి స్నేహితులుగా ఉండేవాళ్ళు సినిమాల విషయంలో పోటీ పడచ్చు. సరిగ్గా ఈ ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో అదే జరిగింది.

“సరిలేరు నీకెవ్వరు” టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వచ్చారు. మరోవైపు ఆయన సొంత మనిషి అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురం లో సినిమా కూడా అదే సీజన్ కి బరిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కొత్త సంవత్సరం మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారితో త్రివిక్రమ్ గారు కలిసిన విషయం బయటకు రాగానే అందరూ ఇక అల..వైకుంఠపురం లో సినిమా ప్రీ రిలీజ్ కు పవర్ స్టార్ గెస్ట్ గా వస్తారంటూ సందడి చేసారు. కానీ అలా జరగలేదు. చివరకు రెండు సినిమాలు నువ్వా – నేనా అన్నట్లు పోటాపోటీగా ఆది విజయం సాధించాయి.

ఇప్పుడు హీరో నాగశౌర్య పరిస్థితి కొంచెం అలాగే ఉంది. ఈ నెల 31న తను హీరోగా చేసిన అశ్వత్థామ సినిమాతో పాటు, రాజ్ కందుకూరి గారి తనయుడు హీరోగా వస్తున్న “చూసీ చూడంగానే” సినిమా కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆ సినిమా టైటిల్ తన గత హిట్ “చలో” సినిమాలో ఆడియెన్స్ కి బాగా రిజిస్టర్ అయిన పాట. ఆ సినిమా సాఫ్ట్ లవ్ స్టోరీ అయితే తాను చేస్తున్నది పక్కా యాక్షన్ కథ. కాబట్టి నాగశౌర్య కి ఇది ఒకరకమైన అంతర్యుద్ధం లాంటి పరిస్థితి. ఇక రెండు సినిమాలు జోనర్స్ సెపరేట్ కాబట్టి రెండూ ప్రేక్షకులకు దగ్గరై పెద్ద హిట్ అవ్వాలని ఆశిద్దాం.