నాగశౌర్య కు జరిమానా 


Hero Naga shourya Shocked with Traffic police
Hero Naga shourya Shocked with Traffic police

యంగ్ హీరో నాగశౌర్య కు జరిమానా విధించారు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు .

నాగశౌర్య కారు కి జరిమానా ఎందుకు విధించారో తెలుసా …….. బ్లాక్ ఫిలిం ఉండటం వల్ల .

కార్లకు బ్లాక్ ఫిలిం అంటించొద్దు అని స్పష్టంగా పోలీసులు చెబుతున్నప్పటికీ పలువురు సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు తమ కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం లు అంటిస్తున్నారు .

నాగశౌర్య కూడా తన కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అంటించడంతో బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని ఆపి 500 రూపాయలు ఫైన్ వేశారు అంతేకాదు , కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం ని తొలగించారు .

ఈ సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జరిగింది .

ఇటీవలే ఓ బేబీ చిత్రంలో నటించి సక్సెస్ అందుకున్న నాగశౌర్య తాజాగా సొంత చిత్రంలో నటిస్తున్నాడు .