షూటింగ్ లో గాయపడిన నాని


హీరో నాని గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో గాయపడ్డాడు . తాజాగా నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని కిందపడటంతో కాలికి గాయం అయ్యింది . వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా నాని ని పరిశీలించిన డాక్టర్లు కంగారు పడాల్సిందేమి లేదని కాకపోతే కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారట

దాంతో డాక్టర్ల సలహా మేరకు  నాని విశ్రాంతి తీసుకుంటున్నాడు . నాని కాలికి గాయం అయ్యింది కానీ అది పెద్దది కాకపోవడంతో గ్యాంగ్ లీడర్ చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది . మనం , 24, ఇష్క్  వంటి  హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . మేఘా ఆకాష్ , ప్రియాంక అరుళ్ హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్నాడు