నేచుర‌ల్ స్టార్ కూడా డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ!


నేచుర‌ల్ స్టార్ కూడా డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ!
నేచుర‌ల్ స్టార్ కూడా డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ!

నేచుర‌ల్ స్టార్‌ నాని పాండమిక్ టైమ్‌లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఫ‌లితం ఆశించిన స్థాయిలో రాక‌పోవ‌డంతో కొంత నిరాశ‌కు గురైన నాని ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్నారు.

ఎనిమిది నెల‌ల విరామం త‌రువాత `ట‌క్ జ‌గ‌దీష్‌`ని ప‌ట్టాలెక్కించాడు. ఈ మూవీ త‌రువాత `శ్యామ్ సింగ రాయ్‌`ని ప్ర‌క‌టించిన నాని ఇటీవ‌లే ఈ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండూ సెట్స్‌పై వుండ‌గానే `బ్రోచే వారెవ‌రురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో అడ‌ల్ట్ కామెడీ నేప‌థ్యంలో `అంటే.. సుంద‌రానికి` అనే చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. ఇలా మూడు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వున్న నాని తాజాగా మ‌రో గుడ్ న్యూస్ చెప్పాడు.

ఇప్ప‌టికే చాలా మంది డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తుంటే నేచుర‌ల్ స్టార్ నాని కూడా డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఇప్ప‌టికే ఓ ప్రాజెక్ట్‌ని నెట్‌ఫ్లిక్స్‌కి చేయ‌డానికి అగ్రిమెంట్ చేసుకున్నాడ‌ట‌. దాదాపు ఆరు నెల‌ల మంత‌నాల త‌రువాత నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ముందు అంగీక‌రించిన సినిమాలు పూర్త‌యిన త‌రువాతే నాని నెట్‌ఫ్లిక్స్‌కి డేట్స్ కేటాయిస్తార‌ట‌.