వెనక్కి తగ్గిన నిఖిల్Hero Nikhil as Arjun Suravaram

ముద్ర అనే టైటిల్ నాది అంటూ నిర్మాత నట్టికుమార్ పై గోల గోల చేసిన నిఖిల్ మొత్తానికి సహచరుల సలహాతో , సూచనలతో వెనక్కి తగ్గాడు . తన సినిమా అని చెప్పుకున్న ముద్ర ని తీసేసి మరో టైటిల్ పెట్టుకున్నాడు అర్జున్ సురవరం అని . తమిళంలో విజయం సాధించిన కణితన్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్.

గతకొంత కాలంగా నిఖిల్ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతున్నాయి దాంతో తమిళ హిట్ మీద పడ్డాడు . కట్ చేస్తే ఈ సినిమా టైటిల్ విషయంలో నట్టికుమార్ తో గొడవ అయ్యింది . అందుకే తన సినిమాకు ముద్ర బదులుగా అర్జున్ సురవరం అనే టైటిల్ ని పెట్టుకున్నాడు . ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు నిఖిల్ . ఇక ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Hero Nikhil as Arjun Suravaram