నిఖిల్ ఎందుకు ప్రచారం చేస్తున్నాడో తెలుసా ?


యంగ్ హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచాడు . ఆంద్రప్రదేశ్ లోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నాడు కూడా . హాయిగా సినిమాలు చేసుకునే హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీ తరుపున ఎందుకు ప్రచారం చేస్తున్నాడో తెలుసా …. ….. చంద్రబాబు నాయుడు మీద రాజకీయంగా ముప్పేట దాడి చేయడం నిఖిల్ సహించలేక పోయాడు .

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ,ఆ అలాగే మోడీ తెలుగుదేశం కు మద్దతుగా నిలవడమే కాకుండా మేము కేంద్రం లో అధికారంలోకి వస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది . ఇక జగన్ పార్టీ ఏమో ప్రత్యేక హోదా గురించి అడక్కుండా చంద్రబాబు ని ఇబ్బంది పెట్టడానికి మోడీ , కేసీఆర్ లతో కుమ్మక్కు కావడం . అలాగే కేసీఆర్ కూడా మోడీ , జగన్ లతో కలిసి చంద్రబాబు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా కలిసి అడ్డుకోవడం చూసి నిఖిల్ మండిపోతున్నాడు .

అందుకే తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నాడు . ఎవ్వరూ నిఖిల్ ని ప్రచారం చేయమని కోరినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చంద్రబాబు రావాల్సిందే అంటూ కొంతమంది కుట్రలను తిప్పి కొట్టడానికి తెలుగుదేశం కు అండగా నిలిచాడు నిఖిల్ .